ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 29 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్( ఎస్డిఎఫ్) నిధులు రూ .1.80కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
నగరంలోని 13వ డివిజన్ శ్రీనగర్ కాలనీ రోడ్ నెం.1 లో రూ.90 లక్షలు, 9వ డివిజన్ ఇందిరా నగర్ నందు కల్వర్టు లతో కూడిన 2.5కిలో మీటర్ల మేర సీసీ డ్రైన్ కు రూ.90లక్షలు మొత్తం రూ.1.80కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ, జాన్ భీ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఎంఈ కృష్ణలాల్, డిఈ ధరణి, నాయకులు వల్లభనేని రామారావు, నాగుల్ మీరా, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.