మణికొండ ప్రజాబలం ప్రతినిధి: మణికొండలో ప్రజల వద్దకే ఆర్ టీ సీ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజాసేవకై ముందుకు వచ్చినందున ఆకర్షించి తమ వంతు సహాయసహాకారంగా వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ అధ్యక్షుడు బత్తుల బాపూజీ, ప్రధాన కార్యదర్శి డీ. సీతారాం దాస్, కోశాధికారి దిలీప్ కక్కడ్, ప్రదీప్ రావు, సభ్యులు అందె లక్ష్మణ్ రావు, సాదు నాగేంద్ర రావు, విజయలక్ష్మీ తదితరుల ఆధ్వర్యంలో శుక్రవారము రోజున ఆంధ్ర బ్యాంక్ (ప్రస్తుత యూనియన్ బ్యాంక్) సర్కిల్లో జరిపిన సమావేశానికి ముఖ్య అతిథిలుగా కే. రామ కృష్ణ రెడ్డి, ఆర్ టీ సీ అధికారులు డిప్యూటీ రీజనల్ మేనేజర్ అపర్ణ కల్యాణి, డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మా, సీ ఆర్ సీ ధర్మేంద్రలు ప్రజా ప్రాయోజనంగా బస్ నెంబరు 47/వై.ఎమ్, 65/123, 126, 221 ఆదిగా మంచిరేవుల, నార్సింగిల నుండి సికింద్రాబాద్, అఫ్జల్ గంజ్, మెహ్దిపట్నమ్, మెట్రో రైల్ మార్గాలలో, జే ఎన్ టీ యుల వరకు ప్రజల సౌకర్యాయార్థం నడిపిస్తున్నామని మరియు కేవలం 80 రూపాయలకు 24 గంటలు, 50 రూపాయలకు ఉదయం 10 నుండి 4 వరకు ఏ బస్లో నైనా ప్రయాణించే సౌకర్యం కలదని, తిరుమల దైవ దర్శనమ్తో కూడిన ప్రయాణ సౌకర్యం కలదని, ఈ అన్ని విషయాలలో ఆర్ టీ సీ అధికారులకు, బస్ డ్రైవర్లకు, కండక్టర్లకు ప్రజలందరూ సహకరించాలని ప్రజానీకానికి విన్నవిస్తూ వారి అమూల్యమైన అభిప్రాయాలను పరగణనలోకి తీసుకొని వివిధ రూట్ లలో బస్ సౌకర్యం గావిస్తమని, యాదగిరి గుట్టకు వారాంతపు బస్, మణికొండలో కంట్రోల్ రూం తది తర సేవలందించడానికి ఎల్ల వేళలా సుముఖంగా ఉన్నట్లు అధికారులు తెలియేశారు, ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమంలో మణికొండ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం గావించినారు. వీ ఆర్ ఫర్ యు వయోజన సభ్యులు ప్రజానీకానికి ధన్యవాదాలు సమర్పిస్తు అధికారులకు చిరు సత్కారం గావించునారు.
