మణికొండ ప్రజాబలం ప్రతినిధి:గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని బీ ఆర్ పీ ఎస్/పీ ఎం పీ/ ఆర్ యం పీ వైద్య సంఘాల ప్రసిడెంట్ డా.జాఫర్ మరియు మహిళా అధ్యక్షురాలు డా. ప్రభావతి ఆధ్వర్యంలో మణికొండ మునిసిపల్ కౌన్సిల్ పరిధిలో ఉన్న ఆర్ యం పీ వైద్యుల సంవత్సర పదవి కాలనికి బుధవారం ఉదయం 11 లకూ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగినది: ప్రసిడెంట్గా హరిబాబు, వైస్ ప్రసిడెంట్గా హనుమంత్ రావు, కార్యదర్శిగా అశ్విన్ కుమార్, సహాయ కార్యదర్శిగా లక్ష్మణ్ రాజు, కోశాధికారిగా ప్రభావతి, ఆర్గనేజర్గా నరేందర్, కన్వినర్గా నాగరాజు గౌడ్, మెంబెర్గా చలపతిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మరియు నూతన కమిటీని ప్రకటించిన తదుపరి డాక్టర్ వెంకట్ రెడ్డికి ఘన సన్మానం చేయడం, అందరు వైద్యులు తమ హద్దులు మీరి, పరిధిలు దాటి వైద్యం చేయకూడదని, ప్రాథమిక చికిత్స తక్కువ ధరకే పేద, బీద రోగులకు వైద్యం అందించాలని అయన అన్నారు, రాబోయే 2024 లో అందరికి మంచి రోజులు వస్తాయని, ప్రభుత్వం నుండి గుర్తింపు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపినారు ఆ తర్వాత డా. ఎస్ వి ఆర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపినారు.