గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వహణ

 

తెల్లవారి నుంచి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు

విచ్చలవిడిగా దందా కొనసాగుతున్న పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

నెలవారీగా మామూల మత్తులో అధికారులు?

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 25

గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉదయం 5 గంటల నుండి మొదలై రాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతున్న మద్యం అమ్మకాలు ప్రభుత్వ అనుమతితో నడిచే వైన్ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కొనసాగుతాయి. కానీ బెల్ట్ షాపులకు మాత్రం జెండా పండుగ గాంధీ జయంతి పండుగలు అనే తేడా లేకుండా 24 గంటలు మద్యం అమ్మకాలు జరుగుతుండడం గమనార్థం పట్టణ ప్రాంతంలో వైన్స్ లు రాత్రి 10 గంటలకు మూసివేయగా బెల్ట్ షాపుల్లో మాత్రం ఏ మధ్య రాత్రి అయినా తలుపు తట్టిన క్షణం ఏటీఎం లాగా కావలసిన మద్యం లభిస్తుంది.

పేరుకే కిరాణం అమ్మేది మద్యం?

పట్టణ కేంద్రంలోను గ్రామాల్లోనూ కొంతమంది పేరుకు కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. దీనికి తోడు వైన్ షాప్ లో యజమానులు సిండికేట్ గా ఏర్పడి కొన్ని కొన్ని ఊర్లకు ఒక షాపు అనేవిధంగా నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్న కానీ ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామాల్లో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల కారణంగా మద్యం ఏరులై పారుతుంది.

సంసారంలో మద్యం చిచ్చు.

విచ్చలవిడిగా గ్రామాల్లో దొరుకుతున్న మద్యం కారణంగా పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుందని గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండడంతో యువత పెడదారి పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల కనుసన్నల్లోనే బెల్ట్ షాపులు ?

మండలాల వ్యాప్తంగా ప్రతి నెల బెల్ట్ షాపుల ద్వారా లక్షల్లో మద్యం విక్రయాలు పోతున్నాయి. వైన్ షాప్ యజమానులు ఎక్సైజ్ పోలీస్ అధికారులు అండదండలతో మండలాల్లో గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు నిర్వహిస్తూ వైన్ షాప్ లు తలపించే విధంగా చేస్తున్నాకానీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

అధిక ధరలకు విక్రయాలు

పట్టణాలు మండల కేంద్రాల్లో ఉన్న మద్యం షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయాలు జరుగుతుండగా బెల్టు షాపుల నిర్వాహకులు మాత్రం అధిక ధరలకు విక్రయించి మందు బాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రై డే నిర్వహించిన గాని గ్రామాల్లో జోరుగా విక్రయాలు కొనసాగుతున్నాయి.ఇంత జరుగుతున్న సంబంధిత అధికారుల దృష్టికి రావడం లేదా వచ్చినా చర్యలు తీసుకోవడం లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగించాలంటూ పలువురు మహిళలు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. కూలి నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలు పని చేసి వచ్చి పట్టణానికి వెళ్లి మద్యం తాగడం ఎందుకు అని గతంలో ఇండ్లలో ఉండేవారు. కానీ గ్రామాల్లో బెల్ట్ షాపుల వలన కూలి పని తో వచ్చిన డబ్బులో సగం డబ్బు మద్యానికి వేచి చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking