హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజా బలం ప్రతినిధి జనవరి 22
హుజురాబాద్ మండల పరిధిలోని బోర్నపల్లి గ్రామం 14 వ వార్డుకు చెందిన సమ్మెట సాయిరాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, త్వరగా గుండెకి సర్జరీ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాడని తెలిసి, చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఆర్ధిక పరిస్థితి బాగాలేదని లేదని వెంకట్ అనుచరుడు బోర్నపల్లి కి అర్జున్ మేడుదుల ద్వారా తెలిసిన వెంటనే ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ స్పందించి ప్రభుత్వ దృష్ఠ్టికి తీసుకెళ్లి గంటల వ్యవధిలోనే వైద్యఖర్చుల కోసం కావాల్సిన 1,25,000/- రూపాయల ఎల్ వో సి మంజూరు చేయించారు. ఎల్ఓసి తో పాటు సర్జరీ కి కావాల్సిన రక్తం కూడా ఏర్పాటు చేసారు. ఆపదలో నేనున్నా అంటూ సబ్బని వెంకట్ స్పందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
