ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం

 

యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 22

జమ్మికుంట మండల పట్టణ కేంద్రాలలో జరిగే గ్రామ సభలలో పాల్గొన్న జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ గ్రామ సభలలో లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిజమైన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ, గ్రామసభల ద్వారా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందనీ ప్రజలకు తెలియజేశారు. బిఆర్ఎస్ పది సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ సంక్షేమ ప్రజా పాలనలో వచ్చిన సంవత్సరంలోనే అనేకమైన ప్రజారంజక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అర్హులైన కుటుంబాలకు ప్రతి పేద ఇంటికి సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రజా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వకుండా నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం కాలం వెల్లదీసిందని అనేక రకాల ఇబ్బందులకు గురిచేసిందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికి రేషన్ కార్డులతో పాటు లబ్ధిదారులకు ప్రతి పథకాన్ని అందజేయడానికి, పారదర్శకంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మి అధైర్యపడవద్దని బుడిగె శ్రీకాంత్ ప్రజలకు భరోసా కల్పించారు. వారి వెంట యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బిజీగిరి శ్రీకాంత్,కార్యదర్శి అజయ్,భాను, జావిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking