హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి మార్చి 17
హుజరాబాద్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ లోని హజ్రత్ సయ్యద్ ఇంకెషావలి అలీ దర్గా ను సామాజికవేత్త జెన్ ప్యాక్ కంపెనీ వైస్ చైర్మన్ సబ్బని వెంకట్ సందర్శించారు.ఈ సందర్భంగా దర్గా కమిటీ వారు ఘన స్వాగతం పలికి మత గురువు మహమ్మద్ యాసిన్ తో ప్రత్యేకమైన ఫాతిహా ఖానీ(ప్రత్యేక పూజ) జరిపించారు. అనంతరం దర్గా కమిటీ వారు అభివృద్ధి కొరకు పలు పనులను సబ్బని వెంకట్ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించి 50 బస్తాల సిమెంటును అందజేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అధ్యక్షులు మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో సబ్బని వెంకట్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట బిజిగిరి షరీఫ్ గ్రామ ప్రజలు, ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు.