ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 19 : లక్షెట్టిపేట పట్టణంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని ఎస్సై సతీష్ బుధవారం తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ లతో పాటు డ్రైవర్ల పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామన్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.