శివాజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

బీజేపీ జిల్లా నాయకులు రఘునాథ్ పిలుపు

ఘనంగా చత్రపతి శివాజి మహారాజ్ జయంతి వేడుకలు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు వెరబెల్లి రఘునాథ్ పిలుపునిచ్చారు. బుధవారం లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా బైక్ ర్యాలీ గాంధీ చౌక్ నుండి పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా కరీంనగర్ చౌరస్తాలోని శివాజీ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీ శివాజీ విగ్రహం వద్దకు చేరుకున్నాక కాషాయ జెండా ఆవిష్కరణ చేసి,శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…హిందూ ధర్మం వర్ధిల్లాలంటే ప్రతి కుటుంబం నుండి ఒక శివాజీ సైనికుడు తయారు కావాలని కోరారు. యువకులు అందరూ శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం అల్పాహారం ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గుండ ప్రభాకర్, దిలీప్,ఉమేష్,వేముల మధు,ఎంబడి వెంకటేష్, లక్షెట్టిపేట మున్సిపాలిటీ అధ్యక్షుడు విరమల్ల హరిగోపాల్,మండల అధ్యక్షుడు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి,దండేపల్లి మండల అధ్యక్షుడు గోపతి రాజన్న, సామ వెంకటరమణ,వినోద్, మోట పలుకుల సతీష్, లకావత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking