2009 విద్యాహక్కు చట్టం అమలు పరచాలి
అంబేద్కర్ అభయ హస్తం కింద 12 లక్షలు ప్రతి మాదిగ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన,
డప్పుకొట్టే, చెప్పుకుట్టే, మాదిగలకు 5000 పెన్షన్ ఇవ్వాలి అని డిమాండ్.
….రాష్ట్ర అధ్యక్షులు సిరిసనోల్ల బాలరాజ్ మాదిగ
సంగారెడ్డి జులై 15 ప్రజ బలం ప్రతినిధి :డి అశోక్. పఠాన్ చేరు నియోజకవర్గం లోని ఇస్నాపూర్ టిఎంఆర్పిఎస్ జిల్లా ఆఫీసు లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిరిసనోల్ల బాలరాజ్ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ*ఈనెల జూలై 30,31 నాడు టిఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ, సెప్టెంబర్ 1 నుండి 10 వరకు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నివాసం నుండి హైదరాబాద్ వరకు టిఎంఆర్పిఎస్ పాదయాత్ర.
1) *ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ.
2) అంబేద్కర్ అభయ హస్తం కింద 12 లక్షలు ప్రతి మాదిగ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.
3) 2009 విద్యాహక్కు చట్టం అమలు పరచాలి.
4) *పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి.
5) మాదిగ సంఘాల ఉద్యమకారులకు250 గజాల స్థలం కేటాయించాలి.
6) వికలాంగులకు 7000 పెన్షన్ మంజూరు చేయాలి.
7) *సదా లక్ష్మమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలి.
8)* డప్పుకొట్టే చెప్పుకుట్టే మాదిగలకు 5000 పెన్షన్ ఇవ్వాలి.
సంఘం బలోపితానికి జిల్లా, నియోజకవర్గ, మండల, కమిటీలు వేసి ఈ(8)అంశాలను ప్రజల తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపాగ జంగయ్య మాదిగ ,సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ కొంగలిరి కృష్ణా మాదిగ, పటాన్ చెరువు రాజు మాదిగ, గంపల రాజు మాదిగ,రామచంద్రయ్య, మార్క్, కర్రే హనుమంతు మాదిగ రాములుమాదిగ, ప్రవీణ్, శీను, తదితరులు పాల్గొన్నారు.