ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 15:
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డి ఆర్ ఓ హరిప్రియ తో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమంలో (80) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.