రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 జూలై 2024:
ఆదివారం రోజున భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్, రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సమయంలో ప్రణాళిక మరియు సమన్వయ వ్యూహ కర్తగా వ్యవహరించిన సీతారాం ధూళిపాళకు పిలుపు నివ్వగా, అందుబాటులో ఉన్న మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కుంబగళ్ల ధనరాజ్, మణికొండ వార్డ్ కౌన్సిలర్లు వసంత్ రావ్ చౌహాన్, ఆలస్యం నవీన్ కుమార్, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, సయ్యద్ ఆరిఫ్ మొహమ్మద్, సంఘం శ్రీకాంత్, రామ సుబ్బారెడ్డి, ఉపేంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ కర్నాటి శ్రీనివాస్ లతో కలిసి వెళ్ళడం జరిగినదని, తదుపరి పార్టీ మనుగడ మరియు పురోగతిని దృష్టిలో ఉంచుకుని మణికొండలో పార్టీ నాయకులతో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే అందుకు తాను తప్పకుండా వచ్చి కార్య కర్తలను ఉత్తేజ పరుస్తూ మార్గదర్శనం చేస్తానని చెప్పడం జరిగినదని సీతారాం ధూళిపాళ తెలిపినారు
Prev Post