రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 జులై 2024:
ఆదివారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లోని హుస్సేన్సాగర్ నిండుకుండలా మారింది. జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందనీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హుస్సేన్సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతానికి నీటి మట్టం 513 అడుగులు దాటింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు బుల్కాపూర్, కూకట్‌పల్లి, బంజారా నాలాల వరద నీరు మొత్తం హుస్సేన్సాగర్‌లో చేరుతోందని పరిష్కారంగా హుస్సేన్ సాగర్ 2 గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారనీ నీటిమట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలన చేశారు. మళ్లీ రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే నేపథ్యంలో ముంపునకు గురయ్యే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలనూ జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.
Prev Post