పెద్దపల్లి పార్లమెంట్ టీడీపీ కన్వీనర్ గా సంజయ్ కుమార్

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ అక్టోబర్ 29 :

పెద్దపల్లి పార్లమెంట్ తెలుగు దేశం కన్వీనర్ గా బి. సంజయ్ కుమార్ ను నియమిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు ప్రకటించారు. మంగళవారం ఆయన చేతుల మీదుగా పార్టీ సభ్యత్వంను సంజయ్ కుమార్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ గా నాకు కీలకమైన బాధ్యత ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీకీ పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం చేయిస్తానని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking