క్యూబాపై అమెరికన్ సామ్రాజ్యవాద నిరంకుశ,నిర్బంధాన్ని ఖండిద్దాం.

క్యూబా ప్రజలకు అండగా నిలబడదాం

సీఐటీయు ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన ప్రదర్శన

దుంపల రంజిత్ కుమార్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ అక్టోబర్ 29 : సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని స్థానిక ఎం ఆర్ ఓ కార్యాలయం రోడ్డు పై ప్లే కార్డులతో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. మంగళవారం ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ…గత 31 సంవత్సరాలుగా జనరల్ అసెంబ్లీ “క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా విధించిన ఆర్థిక,వాణిజ్య మరియు ఆర్ధికదిగ్బంధనానికి ముగింపు పలకాలి” అనే తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో ఆమోదించింది. గత 63 సంవత్సరాలుగా దిగ్బంధనం వల్ల క్యూబా ఆర్ధికంగా 164.14 బిలియన్ డాలర్లను సష్టపోయింది. ద్రవ్యోల్బణం రీత్యా చూస్తే ఇది మొత్తం 1.499 ట్రిలియన్ డాలర్లు ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు అమెరికన్లు క్యూబాకు ప్రయాణించటానికి అడ్డంకులు కల్పిస్తూ అనేక కొత్త కొత్త నిబంధనలను జారీ చేసింది.అవే ఆంక్షలు, నిబంధనలు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరిపాలనలో కూడా కొనసాగుతున్నాయి.ఈ నిబంధనల కారణంగా ఆహార దిగుమతులు తగ్గిపోయాయి.
అమెరికా క్యూబాను తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా (ఎస్ ఎస్ ఓ టీ) గా పరిగణిస్తున్నందున, ఇది క్యూబా యొక్క ఆర్థిక మరియు బ్యాంకింగ్ లావాదేవీలు,విదేశీ వాణిజ్యం,ఆదాయ వనరులు,ఎనర్జీ మరియు క్రెడిట్ లావాదేవీలకు తీవ్ర అవరోధం మారింది. క్యూబా ఆరోగ్య సంరక్షణ,ఆహారం మరియు వ్యవసాయ రంగాలకు వర్తించే విధంగా అమెరికా ఉద్దేశపూర్వకంగా నిషేధాలు మరియు పరిమితులను అమలుచేస్తున్నది.ప్రస్తుతం ఉన్న వ్యవసాయ యంత్రాల నిర్వహణకు అవసరమైన ఇంధనం,నూనెలు మరియు లూబ్రికెంట్ల కొరత,ఎరువులు మరియు పురుగు మందుల కొరత టన్నుల కొద్దీ ఉత్పత్తులను శీతలీకరించే సామర్థ్యం కోల్పోవడం వంటి కారణాల వల్ల ఆహార ఉత్పత్తి తగ్గింది.ఈ దిగ్బంధనం వల్ల సహకార సంఘాలు మరియు రైతులు వాడే యంత్రాల కోసం విడి భాగాలు, ట్రాక్టర్లు.హార్వెస్టర్లు మరియు ఇతర రవాణా సాధనాలు అందుబాటులో లేక వ్యవసాయం స్తంభించిపోయినది. అలాగే సాగులో లేని భూమిని ఉత్పత్తికి ఉపయోగించేందుకు వాడే ముడి పదార్థాలు లేక ఇతర ఉత్పత్తులు నిలిచిపోయాయి. క్యూబా నేడు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు మొత్తం ద్వీపంలోని 11 మిలియన్ల జనాభాలో 10 మిలియన్ల ప్రజలకు విద్యుత్తు
సరఫరా నిలిచిపోయింది.
ఈ దిగ్బంధనం యొక్క ప్రధాన లక్ష్యం ఆకలితో క్యూబా జనాభా మరణిస్తే, ప్రజలు వారి అధికారులకు వ్యతిరేకంగా తిరగబడతారు.కావున ప్రస్తుతం జరగబోయే ఐక్య రాజ్య సమితి సమావేశాల్లో క్యూబా దేశం పై అమెరికా సామ్రాజ్య వాజ్య దేశం పెట్టిన నిర్భంద్దాంను తీసివేసి,క్యూబా ప్రజలకు ఈ దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారికి మద్దతుగా ఉండాలని కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో (సీఐటీయూ) మెడికల్ హెల్త్ యూనియన్ జిల్లా నాయకులు నాయకులు మల్లేష్, శోభ ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి,సునీత, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking