సారంగాపూర్ మండలం చించోలి (బి )మహిళా ప్రాంగణంలో దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. 74 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న దాదాపు అన్ని మండలాల నుంచి దివ్యాంగులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ ఇవ్వడంతో పాటు ఇలా సకలంగులతో సమానంగా దివ్యాంగులకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సారంగాపూర్ ఎంపీపీ అట్ల.మహిపాల్ రెడ్డి ,అడెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ ఐటి.చందు, నిర్మల్ పిఎసిఎస్ చైర్మన్ ధర్మాజీ గారి రాజేందర్, ఆత్మ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల. మురళీధర్ రెడ్డి, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి వై.పి రమేష్ , వయవృద్ధుల సంక్షేమ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్తి సాయన్న ,క్రాంతి కుమార్ సురేందర్, గంగన్న ,ప్రవీణ్ కుమార్, ఐసిడిఎస్, ఐసి పి ఎస్, మహిళా శక్తి సిబ్బంది మహిళా ప్రాంగణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking