సదాశివపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

సదాశివపేట ఆగష్టు 18 ();సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో దుర్గా భవాని మందిరం వద్ద కౌండిన్య సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ బహుజన చక్రవర్తి అయినా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 1650 సంవత్సరం ఆగస్టు 18న జన్మించి బహుజనులను ఏకం చేసి మోగులాయలను అంతం చేసి దాదాపు 27 కోటలను నిర్మించిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఘనత అని కొనియాడుతు తెలియజేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జరుపుకొనుటకు అధికారికంగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. నేటితరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగాలని తెలియజేశారు. తదన అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా అందరికీ పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కౌండిన్య సంఘం అధ్యక్షులు కోవూరి రామన్న గౌడ్, మాజీ కౌన్సిలర్ నల్లజయరాములు గౌడ్, మాజీ కౌన్సిలర్ నల్ల సత్యం గౌడ్, న్యాయవాది వై.భవంతరావు, ఎర్ర వీరేందర్ గౌడ్, పెద్ద నరసింహులు గౌడ్, ఎర్ర నరసింహ గౌడ్,కోవూరి రాఘవేందర్ గౌడ్,కనిగిరి ధనంజయ గౌడ్, మద్దికుంట యాదగిరి గౌడ్, తంగడపల్లి ప్రవీణ్ గౌడ్ , నల్ల కాశీగౌడ్, కరాటే మాస్టర్ అశోక్ మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking