మృతికి కారకులైన వారిని కచ్చితంగా శిక్షించాలి

-మృతురాలి తల్లిదండ్రులు

తాము అల్లరి ముద్దుగా పెంచుకొన్న తమ కూతురిని తీవ్ర వేధింపులకు పాల్పడడమే కాక ఆమె మృతికి కారణమైన భర్త సంతోష్ తో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని అత్తాపూర్ కు చెందిన రామ్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020 మార్చ్ 19న అత్తాపూర్ ఎల్ఎం గూడా కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ కుమార్ తో వివాహం జరిపించామని చెప్పారు. వివాహ సమయంలో రూ 5 లక్షల నగదు 49 బంగారము వెండి ఆభరణాలు రెండు బైకులు ఇతర సామాగ్రి ని సైతం సమకూర్చమని తెలిపారు. వివాహం జరిగిన కొద్ది రోజుల నుంచే అత్తింటి వారి వేధింపులు ప్రారంభమయ్యాయని అధిక ఖడ్గం తీసుకురావాలంటూ నిత్యం తమ కుమార్తెను వేధింపులకు గురి చేసే వారిని ఆరోపించారు. ఇటీవల నగరంలో ఖరీదైన స్లాట్ కొని ఇవ్వాలంటూ వేధింపులకు దిగారని అన్నారు. ఇదిలా కొనసాగుతుండగా ఈనెల 11న తమ కుమార్తె అనుమానాస్పద స్థితిలో మామ ‌ మోహన్ రెడ్డి గదిలో మృతి చెందిందని చెప్పారు. తమకు ఆత్మహత్య చేసుకుందని చెప్పే ప్రయత్నం చేశారని, తన కుమార్తె ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని ఆమె మృతి వెనుక అత్తమామలు కళావతి మోహన్ రెడ్డి తో పాటు ఆడపడుచు సవిత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి లా ప్రళయం తోనే తమ కుమార్తె మృతి చెందిన ఫిర్యాదు చేయరా పోలీస్ కేస్ నమోదు చేశారని చెప్పారు. ఈ చేతిలో ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా తమ కుమార్తె మృతికి కారకులైన ఐదుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking