ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373 వ జయంతి వేడుకలు

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. జిల్లా సమీకృత కలెక్టరేట్. మినీ. సమావేశం మందిరంలో శుక్రవారం బిసి వెల్ఫేర్ రాజేశ్వర్ గౌడ్. ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ శివాజీ అని దాదాపు 300 సంవత్సరాల క్రితమే వెనకబడిన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహావీరుడని. అన్నారు.
బహుజనుల కోసం, అట్టడుగు అణగారిన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలకు గాను గుర్తించి అధికారికంగా జయంతిని నిర్వహిస్తుందని, అదేవిధంగా పాపన్న గౌడ్ నిర్మించిన కోటలను రక్షిస్తుందని, ముందు తరాలకు తన చరిత్రను తెలియడానికి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు.
నిర్వహించుకోవడం. జరుగుతుందని ఆన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం నాయకులు, అధికారులు కార్యాలయపు సిబ్బంది . తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking