రైతులపై కుట్రపూరితంగానే 220 జీవో అమలు
డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు విమర్శ
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తామని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన మాస్టర్ ప్లాన్ పై నిర్మల్ మున్సిపాలిటీలో ప్రజలు, రైతుల నుండి అభ్యంతరాలు స్వీకరించిన ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని గుర్తుచేశారు. కానీ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతులపై కుట్రపూరితంగా గత ఏడాది డిసెంబర్ నెలలో 220 జీవో తీసుకొచ్చారని ఆరోపించారు. ఇన్ స్థానిక సోఫీ నగర్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న భూములను మంత్రి తోబుట్టువు కొనుగోలు చేసి ఓ కార్పొరేట్ సంస్థకు విక్రయించారని అన్నారు. అందులో నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్న మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల క్రితం జీవో అమలవుతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కేవలం ఎన్నికల కోసం దీక్షల పేరుతో నాటకం ఆడుతున్నారని విమర్శించారు. గతంలో అధికార పార్టీలో ఉన్న తాను పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరాక ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు..దిలావర్ పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో మంత్రి అల్లోల, ప్రతిపక్ష నేత మహేశ్వర్ రెడ్డిలు రైతులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తుందని అన్నారు ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములను బీజేపీ నేత అనుచరులు కొనుగోలు చేయించారని ఆరోపించారు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డికి ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఎలా వచ్చాయో తెలియదని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఫాక్టరీతో బంగారు పంట పొలాలు కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం రద్దు చేయాలని రెండు గ్రామాల సర్పంచులు ఎందుకు గ్రామపంచాయతీ తీర్మానం చేయడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ మంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరు కలిసి నిర్మల్ ప్రాంతాన్ని లూటీ చేస్తున్నారని అన్నారు. రాబోవు రోజుల్లో ప్రజలు ఇద్దరికీ గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు సాదా సుదర్శన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్ ఖాన్, మాజీ కౌన్సిలర్ పొడెల్లి గణేష్, నాయకులు ఎంబడి రాకేష్, చిన్ను, రమణ రెడ్డి, ఖీసర్, మహమ్మద్ బీన్ చౌస్ తదితరులు పాల్గొన్నారు.