రాజ్యాంగాన్ని కాపాడండి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి

కెఎంజిఎంటి చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్
సంగారెడ్డి ఏప్రిల్ 14 (); భారత రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడు సంపూర్ణమైన అవగాహన కలిగి చట్టాన్ని అనుసరించి సమాజంలో ముందుకు సాగాలని ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి పురస్కరించుకొని జిల్లా లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించి మెదలాలని పేరుపేరునా సమాజ శ్రేయస్సు కోసం పోరాడే యోధులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల సందర్భంగా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, యువజన సంఘం నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రతి ఒక్కరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజే

Leave A Reply

Your email address will not be published.

Breaking