సావిత్రి భాయ్ పూలె జయంతిని అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన …. ఎస్ సి/ ఎస్ టి ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్దాపురం దుర్గయ్య
సంగారెడ్డి జనవరి 04 ప్రజ బలం ప్రతినిధి:
సావిత్రి భాయ్ పూలె జయంతిని అధికారికంగా నిర్వహించడనికి జి ఓ.9 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం పట్ల ఎస్ సి /ఎస్ టి ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్దాపురం దుర్గయ్య హర్షo వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలనుండి ఉపాధ్యాయ సంఘం రాష్ట్రo మరియు జిల్లా కమిటీ అధ్యర్యంలో సావిత్రి భాయ్ పూలె జయంతిని నిర్వహించడం వలన ప్రభుత్వం జి ఓ ఇచ్చిందని అన్నారు. గత సంవత్సరo 7-1-2024 న హైదరాబాద్ లో సావిత్రి భాయ్ పూలె జయంతిని ఎస్ సి ఎస్ టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ నిర్వహించిన సందర్బంగా పంచాయతీ రాష్ట్ర శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిధిగా విచ్చేసి హామీ ఇచ్చిన ప్రకారం, ఈనాడు జి ఓ ఇచ్చి వచ్చిందన్నారు. జి ఓ రావడానికి విశేష కృషి చేసిన ఎస్ సి ఎస్ టి రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్ కు మరియు ప్రధాన కార్యదర్శి చవాన్ సుభాన్ సింగ్ మరియు రాష్ట్ర కమిటీ బాద్యులకు సంగారెడ్డి జిల్లా పక్షాన ధన్యవాదములు తెలియచేస్తున్నమని అన్నారు.
జిలాలోని పలు పాఠశాలలో సావిత్రి బాయి పులే జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం పాఠశాల లోని మహిళా ఉపాధ్యాయ లను సన్మానించాడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.