పీఏసీ ఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 04 : మృతుడి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేస్తున్న పీఏసీఎస్. ఛైర్మన్ తిప్పని లింగయ్య.
లక్షెట్టిపేట మండలం లోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బోడకుంటి మహేష్ ఇటీవల అనారోగ్యం తో మరణించారు.కాగా ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం జెండా వెంకటాపూర్ హెడ్ క్వార్టర్ లక్షెట్టిపేట లో మృతుడు పంట రుణం తీసుకోగా అతని పేరిట భీమా కంపెనీ కి సొసైటీ వారు ఇన్సూరెన్స్ కట్టడం తో 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ మంజూరు అయింది.దీంతో శనివారం పీఏసీఎస్.జెండా వెంకటాపూర్ సంఘం చేత పీఏసీఎస్.ఛైర్మన్ తిప్పని లింగయ్య,వైస్-ఛైర్మన్ కాసు సురేష్,డైరెక్టర్ కాండ్రపు సత్తయ్య, ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ పంకజ్, సీఈవో విష్ణువర్ధన్ రావు చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యులు బోడకుంటి రమేష్ కు రెండు లక్షల చెక్కును పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో పీఏసీఎస్.సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.