ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 24:
మందమర్రి ఏరియా సింగరేణి ఎస్సీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ ను మందమర్రి ఏరియా జిఎం జి దేవేందర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్లో కార్మికులంతా కృషిచేసి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం వెంకటేశ్వర్లు, ఐ ఈ డి రాజన్న, శ్యాంసుందర్ పీఎం, ముల్కల రాజలింగు, ఎస్సీ అసోసియేషన్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షులు దాసరి సుదర్శన్, కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శి వాసాల శంకర్, భూపెల్లి కనకయ్య, ఏరియా కార్యదర్శి వై శ్రీనివాస్, పోషన్న, శనిగారపు రాజేష్, దాసరి ఎల్లారం, నాయిని శంకర్, రాజేందర్, పులిపాక సంపత్ లు పాల్గొన్నారు.