కౌన్సిలర్ రామునిగారి శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో భారీగా హాజరైన
ప్రజలు.
తూప్రాన్, జనవరి, 24. ప్రాజబలం ప్రతినిధి.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు తూప్రాన్ మున్సిపల్ 15వ వార్డ్ లో ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించిందని కౌన్సిలర్ రామునిగారి శ్రీశైలంగౌడ్ అన్నారు. శుక్రవారం ఉదయం చాకలి వాడ హనుమాన్ దేవాలయం వద్ద 15వ వార్డు లో గ్రామ సభ నిర్వహించి ప్రజలనుంచి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్, నల్లా కనెక్షన్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకం లకు సంభందించి ప్రజలు స్వచ్ఛందంగా క్యూ కట్టి దరఖాస్తులు సమర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ, కౌన్సిలర్ రామునిగారి శ్రీశైలం గౌడ్, అలాం ఖాన్, బజారు రవీంద్ర, లక్ష్మణ్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.