తూప్రాన్ జాతీయ జెండా వద్ద మహత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తుముకుంట నర్సారెడ్డి.

 

గాంధీజీ ఆశయాలు కొనసాగిద్దాం – తుముకుంట నర్సారెడ్డి.

హాజరైన మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ.

తూప్రాన్, జనవరి,24. ప్రాజబలం ప్రతినిధి :-

భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహత్మా గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తామని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తుముకుంట నర్సారెడ్డి తెలిపారు.
తూప్రాన్ పట్టణం, గాంధీనగర్ లోని జాతీయ జెండా వద్ద శుక్రవారం ఉదయం మహత్మా గాంధీ విగ్రహాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుముకుంట నర్సారెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అని అన్నారు. దేశ ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారన్నారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు అని తెలిపారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు కాబట్టి నేటికీ అందరం గాంధేయ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుముకుంట నర్సారెడ్డి తోపాటు తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్ లు కోడిప్యాక నారాయణ గుప్త, పల్లెర్ల రవీందర్ గుప్త, జిన్నా భగవాన్ రెడ్డి, రామునిగారి శ్రీశైలం గౌడ్, రవీందర్ రెడ్డి, మత్స్య శాఖ డైరెక్టర్ గడప దేవేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కౌన్సిలర్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త, సీనియర్ నాయకులు నేత మహేందర్ రెడ్డి, నాగులపల్లి వేమారెడ్డి, ర్యాకల కృష్ణ గౌడ్, ఆకుల శ్రీరాములు, బజారు విశ్వారాజు, రామునిగారి చిన్న నాగరాజుగౌడ్, దుర్గం నాగేష్, ధనరాజ్, ఉమర్, అశ్ను, షరీఫ్, ఆబోతుపల్లి కే.నర్సింలు, టి.ఎన్.శ్రీనివాస్, తిరుపతి రెడ్డి , వంశిధర్ రెడ్డి, మామిండ్ల లింగం, రాం రాజు వెంకట గోపాల కృష్ణ, కోడీప్యాక టక్కయ్య గుప్త, బొంది సిద్దిరాములు గౌడ్, కృష్ణారెడ్డి, సర్గల నర్సింలు, సాధ వెంకటరాములు, బోల్లు నాగులు, దామోదర్ రెడ్డి, కోవురి శ్రీనివాస్ గుప్త, చందా నారాయణగుప్త, ఉప్పల నర్సింలుగుప్త, కోడిప్యాక లక్ష్మణ్ రావుగుప్త, దుర్గం నగేష్, బాబు, స్వామి, అజయ్, జింక మల్లేష్, మామిండ్ల శ్రీనివాస్, నందాల శ్రీధర్, దివాన్ రోషన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking