ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 24:
మందమర్రి పట్టణంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందింది. పట్టణ ఎస్సై ఎస్. రాజశేఖర్ సంఘటన వివరాలను తెలియజేశారు. బస్టాండ్ ప్రాంతానికి చెందిన
పిల్లలమర్రి లలిత, భర్త శంకర్,( 58) సంవత్సరాలు,వృత్తి: కూలి, మృతురాలు మందమర్రి ఓల్డ్ బస్టాండ్ దగ్గర కూరగాయలు తీసుకొని ఇల్లందు క్లబ్ ముందర రోడ్డు దాటుతూ ఉండగా మంచిర్యాల వైపు నుండి బెల్లంపల్లి వైపుకు వెళుతున్న లారీ TS 29TB 9963 యొక్క డ్రైవర్ అతివేగంగా జాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా నడిపి మహిళలు ఢీకొట్టడంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించిందని ఆయన తెలిపారు. మృతురాలి పెద్దకొడుకు పిల్లలమర్రి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మట్టి లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
మృతరాలకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు సంతారంగా ఉన్నారు. 28 సంవత్సరాలకు భర్త కూడా చనిపోయాడు.