షెడ్యూల్డ్ కులాల వారు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 17:
జిల్లాలోని శాఖల వారీగా రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంత శాతం లబ్ది చేకకూరుతుందనే జాబితాలను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం పరిశీలించారు.
సోమవారం కలెక్టరేట్ విసి హాల్ లో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాకు మంగళవారం రానున్న సందర్భంగా జిల్లా అధికారులతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంత శాతం లబ్ది చేకూరుతుందని శాఖల వారీగా కలెక్టరు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీలకు ఎంత శాతం లబ్దిచేకూరుతుందనే జాబితాలను కలెక్టరు పరిశీలించారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా అందించే రైతు భరోసా,రైతు బీమా,రుణ మాఫీ, గృహాలక్ష్మి, స్వయం సహాయక బృందాల రుణాలు, మహిళా శక్తి, 2 బిహెచ్ కె వంటి పథకాల అమలు లో ఎంత మంది ఎస్సీలకు లబ్ది చేకూరిందని జిల్లా కలెక్టరు సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సలహాలను, సూచనలను అధికారులకు కలెక్టరు తెలిపారు. జిల్లా జనాభాలో ఎస్సీలు ఎంత శాతం ఉన్నారు అని సిపిఓ ను అడిగారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హరిప్రియ, జిల్లా ఎస్సీ అభివృద్ది శాఖ అధికారి వినోద్ కుమార్, సిపిఒ శేఖర్, జిల్లా వ్యవసాయాధికారి చంద్రకళ, విద్యాశాఖాధికారి విజయ కుమారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, హౌజింగ్ఈఈ రమణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ఈడి బాబు మోసిస్, పరిశ్రమలు అధికారి ప్రశాంత్, సివిల్ సప్లై, అధికారి సుగుణబాయి, మెడికల్ అండ్ హెల్త్ అధికారి ఉమాగౌరి, విద్యుత్తు శాఖాధికారి, జిల్లా ఉపాధి అధికారి రాధిక తదితర శాఖల అధికారులు పాల్గొనారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking