ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 17:
కలెక్టరేట్ ప్రజావాణిలో లోనే కాకుండా మున్సిపాలిటి, మండల స్థాయి కార్యాలయాలలో వచ్చే దరఖాస్తులను కూడా పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం జిల్లా అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తో కలిసి మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు స్వీకరించారు. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో (73) ఫిర్యాదులు అందాయన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ ప్రజావాణిలోనే కాకుండా మున్సిపాలిటి, మండల స్థాయి కార్యాలయాలలో వచ్చే దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టరు ఆదేశించారు. జిల్లా అధికారులు జాప్యం లేకుండా దరఖాస్తులను పరిష్కరించి దరఖాస్తుదారునికి సమాచారం తెలియపరచాలని జిల్లా అధికారులను కలెక్టరు ఆదేశించారు.
వివిధ శాఖలలో ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.