మహిళలు తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలి

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ధరావత్ చంద్రకళ

ఘనంగా విశిష్ట మహిళా రమాబాయి అంబేద్కర్ పురస్కారం వేడుకలు

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్, మార్చి 17:

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఘనంగా పట్టణంలోని శ్రీ మంజునాథ గార్డెన్ లో విశిష్ట మహిళ అంబేద్కర్ పురస్కారం 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి ధరావత్, చంద్రకళ మాట్లాడుతూ మహిళలు ఎదగాలని ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగాలని ఆమె అన్నారు. మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతుందని మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మహిళా సాధికారిక సాధ్యమవుతుందని ఆమె పిలుపునిచ్చారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ గాజర్ల దేవేందర్ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో రాణించాలని అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే మరింత మందికి మహిళలకు అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి శ్రీమతి నీరటి రాజేశ్వరి మాట్లాడుతూ మహిళలు ఏటెండర్ నుండి అంతరిక్షం వరకు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారన్నారు. మగువలకి ప్రోత్సాహం లభిస్తే ఏ స్థాయిలోనైనా రాణిస్తారని అవకాశాలను అంది పుచ్చుకొని ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం ఆయా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న 25 మంది మహిళలకి విశిష్ట మహిళా రమాబాయి అంబేద్కర్ పురస్కారం 2025 అవార్డులను అతిథిలచే అందించారు. ఈ కార్యక్రమానికి ఉప్పులేటి నరేష్ అధ్యక్షత వహించగా ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి డాక్టర్ గడప మానస, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, జిల్లా కన్వీనర్ నెరువట్ల రాజలింగు, కోకన్వీనర్ లు కొల్లూరి రవికుమార్, ఆసంపల్లి శ్రీనివాస్, దర్శనాల నవీన్, శ్రీమతి బండ శాంకరి, శ్రీమతి ఉప్పులేటి గోపిక, చిలుక శేఖర్, అంతర్పుల మధు లు పాల్గొనగా చిన్నారులు అమూల్య, వ్రింద, తపస్య, విష్ణు ప్రియ, శార్వాణి బృందం ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking