అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి

*ప్రజావాణి లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

*మొత్తం 113 దరఖాస్తుల రాక

రాజన్న సిరిసిల్లజిల్లా, మార్చి -17
(ప్రజాబలం ప్రతినిధి)

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖకు 49, సిరిసిల్ల మున్సిపల్ కు 11, ఉపాధి కల్పన శాఖకు 6, జిల్లా సంక్షేమ అధికారికి 5, విద్యాశాఖ కు 4, సర్వే శాఖ, చందుర్తి ఎంపీడీఓ కార్యాలయం, ఎస్డిసీకి మూడు చొప్పున,నీటి పారుదల శాఖ, వేములవాడ మున్సిపల్, సెస్ కార్యాలయానికి రెండు చొప్పున, కార్మిక శాఖ, ఇంటర్మీడియట్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, అటవీ శాఖ, ఎస్పీ ఆఫీస్, ఎస్సీ కార్పొరేషన్, ఎంపీడీవో ముస్తాబాద్, కోనరావుపేట, గిరిజన అభివృద్ధిశాఖ, జిల్లా వైద్యాధికారి, డీపీఆర్ఈ, డీఎం ఆర్టీసీ సిరిసిల్ల, ఈడీఎం, హాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, జిల్లా పంచాయతీ అధికారి, దేవాదాయ శాఖ, ఎక్సైజ్ శాఖకు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 113 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణిలో డీఆర్డీఓ శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking