తుమ్మలపై దాడి యత్నాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి
జిల్లా నలుదిక్కుల అభివృద్ధి ప్రదాత మన తుమ్మల
ఈ దాడి యత్నం ప్రజాస్వామ్యంపై దాడి ప్రయత్నమే
ఖమ్మం పౌరసమితి అధ్యక్షుడు డా.పులిపాటి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 20 (ప్రజాబలం) ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఆయనే చిరునామా జిల్లా కేంద్రం నుంచి ఏజెన్సీలోని గుండాల వరకు అభివృద్ధి పేరు చెబితే ఆ వెనుక తుమ్మల నాగేశ్వరరావు నామస్మరణే వినిపిస్తుంది. అలాంటి అభివృద్ధి కామకుడిపై గరళం చిమ్ముతారా..? ఇది ఎంతటి దుర్మార్గం..? ఇది ప్రజాస్వామ్యమా..? రాచరికమా..? రాజకీయ దుర్మార్గులు చేసిన ఈ దుర్మార్గం నిజంగా ప్రజాస్వామ్యంపై దాడికి యత్నమేనని ఖమ్మం పౌరసమితి అధ్యక్షుడు డా.పులిపాటి ప్రసాధ్ అన్నారు.నిన్న మీడీయాతో మాట్లాడుతూ జిల్లాను నలుదిక్కులా అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యమే తప్ప ఆయన మనసులో ఎన్నడూ మరో ఆలోచన ఉండేది కాదు. గడిచిన 40 సంవత్సరాల కాలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతగా కీర్తి గడిస్తున్న తుమ్మలపై అఘాయిత్యానికి పాల్పడడం అనే ఆలోచన రావడమే అత్యంత హేయం. అవినీతి అక్రమాల మచ్చలేకుండా గాంధేయ సిద్ధాంతాన్ని నమ్మిన తుమ్మలపై దురాగతానికి పాల్పడాలన్న ఆలోచన సహించరానిది. అలాంటి దుర్మార్గపు దుశ్చర్యకి మన ప్రజాస్వామ్య దేశంలో సరైన శిక్ష పడాల్సిందే. నాలుగు దశాబ్దాల కాలంగా ఆయనతో నా సహచర్యం ఎన్నో అనుభవాల పుస్తకం. జిల్లా రాజకీయ అవనికపై మచ్చలేని చంద్రుడిగా కీర్తించబడుతున్న తుమ్మల పై అఘాయిత్య ప్రయత్నాన్ని ప్రతి ఒక్క రాజకీయ అభిమాని తెలంగాణలోని ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సిందే. ఆ ప్రయత్నం చేసిన కారకుడికి శిక్ష పడాల్సిందేనని అన్నారు