ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 20:
జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా కలెక్టర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పరిధిలోని తెలంగాణ సాంస్కృతిక సారధి కళాజాత బృందాల సహాయంతో జిల్లాలో గల 5 అస్సెంబ్లీ నియోజకవర్గాలలో స్వీప్ సిబ్బంది సమన్వయంతో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కళాజాత బృందాలు అన్ని అస్సెంబ్లీ నియోజకవర్గాల వారీగా గతంలో అత్యల్ప ఓటింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రదేశాలలో గల స్వయం సహాయక సిబ్బంది, జిహెచ్‌ఎంసి సిబ్బంది మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తమ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జిల్లాలో ఓటింగ్ శాతం పెంపుదల యొక్క ఆవశ్యకతను వివిధ రూపాలలో తెలియపరచినారు. ఇట్టి సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ. డప్పు బాబు, సాంస్కృతిక సారధి కళాజాత బృందంచే కూకట్పల్లి అస్సెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల పర్వతా నగర్ కాలనీ మరియు కూకట్పల్లి రైతు బజార్ నందు నిర్వహించడం జరిగినది. అలాగే, ఉప్పల్ అస్సెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి శ్రీ. దండెపెల్లి శ్రీనివాస్, సాంస్కృతిక సారధి కళాజాత బృందంచే కల్యాణ్ పురి కమ్యూనిటీ హాల్ నందు వోటింగ్ శాతం పెంపుదల కొరకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలను చైతన్యపరచడం జరిగినది. ఇదే విధంగా జిల్లాలోని కళాజాత బృందాలకు సంబందించిన కళాకారులతో స్వీప్ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ, తేదీ: 12.05.2024 వరకు జిల్లాలోని 5 అస్సెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజలు అత్యధికంగా తమ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని, తదనుగుణంగా జిల్లా యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచటానికి చర్యలు తీసుకోవడం జరిగినది.