ప్రధాన మంత్రి కౌశల్య కేంద్ర్ స్కీం(PMKK) కేంద్ర ప్రభుత్వ పథకం నకు సంబందించి ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా అవకతవకలకు పాల్పడిన అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటడ్ సంస్థ నిర్వాహకులు అరెస్ట్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : రామగుండం పోలీస్ కమిషనర్ ఐపీఎస్(ఐజీ)ఎం శ్రీనివాస్ రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించడం జరిగింది.
నిందితుల వివరాలు
1) మల్లికార్జున్, ని: హైదరాబాద్
2) సలీం జాఫర్, ని: నర్సంపేట
3) వెంకటేష్, ని: నర్సంపేట
4) దేవేందర్, ని: మంచిర్యాల
రికవరీ చేయబడిన వస్తువులు
1) ఫేక్ ఫింగర్ ప్రింట్స్
2) ఫేక్ ఫింగర్ ప్రింట్ తయారీకి సంబందించిన మెటీరియల్
3) అభ్యర్థుల అటెండన్స్ రిజిస్టర్ మరియు డాక్యుమెంట్
4) ల్యాప్ టాప్,బయోమెట్రిక్ మిషన్.
వివరాల్లోకి వెళితే….
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం(PMKK)అనే పథకం ద్వారా దేశంలోని నిరుద్యోగ యువత ఉపాధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉచితంగా పలు కోర్స్ లను అందిస్తుంది. ఇట్టి స్కీం ను ప్రభుత్వం భోపాల్ కేంద్రంగా నిర్వహించబడుతున్న అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా దేశంలోని నిరుద్యోగ యువకులలో స్కిల్స్ డెవలప్మెంట్ ను పెంపోందించడం కొరకు ఇట్టి సంస్థ కు భాద్యతలు అప్పగించినది. ఈ యొక్క సంస్థకు సంబందించి మన తెలంగాణ రాష్ట్రం లో హైదరాబాద్ నందు ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. భోపాల్ లో హెడ్ ఆఫీస్ ఆర్గనైజర్ గా సాహిల్ వలి మరియు తెలంగాణ హెడ్ ఆఫీస్ అయిన హైదరాబాద్ లోని మథురానగర్ నగర్ నందు వున్న ఆఫీస్ ఇంచార్జ్ గా ఆవునురి శ్రీనివాస్ భాద్యతలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్ ఆఫీస్ పరిధిలో మన రాష్ట్రంలో మంచిర్యాల తోపాటు హుజుర్ నగర్ మరియు జనగామ లో ఈ యొక్క సంస్థ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు వున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking