ప్రజా బలం ప్రతినిధి మేడ్చల్ జిల్లా డిసెంబర్ 23:
ప్యారడైజ్ నుండి మేడ్చెల్ జిల్లాలోని శామీర్ పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కు రోడ్డు విస్తరణకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలో భాగంగా అల్వాల్, తూంకుంటలో స్థల సేకరణ మార్కింగ్ లను సోమవారం ఇంఛార్జి డిఆర్ఓ శంకర్ కుమార్ తో కలిసి మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పరిశీలించారు.ఈ ప్రాజెక్టు క్రింద నిర్మాణాలు కోల్పొతున్న వారి ఇంటి దస్తావేజులు రేషన్ కార్డులు, ఆధార్, ఓటర్ ఐడి కార్డులను పరిశీలించారు. భూసేకరణకు సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.