మున్సిపల్ కమిషనర్ కు ప్రజాభిప్రాయ సేకరణ వినతి

గండిపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 23 డిసెంబర్ 2024
భారత రాష్ట్ర సమితి మణికొండ నాయకులు కార్యకర్తలు జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మారుతి నగర్ లోని రోడ్ నెంబర్ 2 వాస్తవంగా చివరి భాగం పాలకడ స్కూల్ కాంపౌండ్ వాల్ వరకు ఉండవలసిన ప్రాంతంలో కొంతమంది స్వార్థపరులు రెండు బిల్డింగులు కడుతున్న విషయం, రోడ్ నెంబర్ 3 మరియు 5 లలో వాటితో పాటు ఎలక్ట్రికల్ పోల్స్ ఆక్రమణకు గురైనట్టుగా స్థానికులు తెలియ జేసినారు ఈ విషయమై ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి తగు విచారణ జరపాలని, తత్ ప్రశ్చాత్ చర్యలు గైకొనలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే పార్కు స్థలం 1100 గజాలకు గాను 600 గజాలే మిగిలిన విషయము కూడా కమిషనర్ దృష్టికి తేవడం జరిగింది. ఈ ఆక్రమణలను తక్షణమే అరికట్టాలని వారిని కోరడమైనది. అందుకుగాను కమిషనర్ విచారణ చేయిస్తామని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సీతారాం ధూళిపాళ, కంబగళ్ల ధనరాజ్, గుట్టమీద రాఘవేంద్ర, రూపా రెడ్డి, లక్ష్మయ్య, రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, మాల్యాద్రి నాయుడు, సుమన్, సుమ, నలిని, అనూష, ప్రవీణ్, సంఘం శ్రీకాంత్, జయరాం, తిరుపతి, మొదలగు వారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking