ప్రజబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 3:
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సందర్బంగా కౌంటింగ్ సిబ్బందికి సంబంధించి రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ ఎం ఎస్ ప్రియాంక శుక్లా, దిలీప్ ధ్యాన్ దేవ్,నిరంకర్ సింగ్, మన్ జూర్ అహ్మద్ ఖాద్రి,జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ పర్యవేక్షణ లో ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వి. సి హాల్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గనికి సంబందించి ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఏన్ఐసి సాఫ్ట్ వెర్ వినియోగిస్తూ అన్ లైన్ లో కౌంటింగ్ సిబ్బందికి సంబంధించిన రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది . ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మేడ్చల్, మల్కాజ్గిరి, క్కుత్బుల్లాపూర్ , కూకట్ పల్లి, ఉప్పల్ , ఎల్ బి నగర్,కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం టేబుల్స్ 158, కౌంటింగ్ సూపర్ వైజర్ 158, కౌంటింగ్ అసిస్టెంట్స్ 158 , మైక్రోఅబ్జర్వర్స్ 158, ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు విజయేందర్ రెడ్డి, , డి ఈఓ విజయ కుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.