2 వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 03 : లోక్ సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో 002 పెద్దపల్లి ఎస్.సి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని 002 చెన్నూరు ఎస్.సి,003 బెల్లంపల్లి ఎస్.సి 004 మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో మే 13 న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈ నెల 04 వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కొరకు అవసరమైన పోలింగ్ సిబ్బంది 2 వ విడత ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కౌంటింగ్ పరిశీలకులు విజయ ఈ రవి కుమార్ సమక్షం లో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి 004 మంచిర్యాల అసెంబ్లీ సిగ్నెంట్ సహాయశ రిటర్నింగ్ అధికారి వి రాములు,ప్రత్యేక ఉప పాలన అధికారి ఎల్.ఎ.ఆర్ & ఆర్ 002 చెన్నూరు ఎస్.సి అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి డి చంద్రకళతో కలిసి కౌంటింగ్ సిబ్బంది 2 వ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 04 వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 14 సాధారణ టేబుళ్ళు,1 పరిశీలికుల టేబుల్ ఏర్పాటు చేయడం జరిగిందని,ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్,ఒక అసిస్టెంట్,ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని, అదనపు సిబ్బందితో కలుపు కొని ప్రతి నియోజకవర్గానికి 18 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు,18 మంది కౌంటింగ్ సహాయకులు,18 మంది సూక్ష్మ పరిశీలకుల నియమించడం జరిగిందని తెలిపారు.అదికారులు,సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ సాదయ్య,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి,ఎన్నికల తహశిల్దార్ శ్రీనివాస్,కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్,ఈ- డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్, ఎన్నికల విభాగ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking