సంగారెడ్డి మార్చి 28 ప్రజ బలం ప్రతినిది:
న్యూఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ముందు మాదిగ సంఘాల ఆద్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ డా,పిడమర్తి.రవికి ఇయ్యాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత మాదిగల పక్షాన పోరాడుతున్న ఏకైక నాయకుడు డా,పిడమర్తి.రవి అని ఉద్యమనాయకునికి కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం కేటాయించాలని ఏఐసిసి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.మాదిగ సంఘాల ఆద్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం డా,పిడమర్తి.రవి.కి కేటాయించాలని ఏఐసిసి కార్యదర్శి కోల.రోహిత్ చౌదరి కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షుడు మైస.ఉపేందర్ మాదిగ,జన్ను.రవి తదితరులు పాల్గొన్నారు.
