ఖమ్మం ప్రతినిధి మార్చి 28 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గాల్లో గురువారం జరిగిన పలు శుభకార్యక్రమాలకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి హాజరయ్యారు. ఖమ్మం సారథినగర్ లోని గుర్రం జగన్మోహన్ రావు ఫంక్షన్ హాల్లో జరిగిన పిల్లి వెంకటేశ్వర్లు కుమార్తె వివాహానికి వాసవి గార్డెన్స్ లో జరిగిన సారిక పాపారావు కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. కూసుమంచి మండలం గైగొళ్లపల్లి గ్రామంలో సంగబత్తుల లక్ష్మారెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు అభినందనలు తెలిపి పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు