గూడు లేని నిరుపేద‌ల‌కు క్ర‌మ‌బద్ధీక‌ర‌ణ‌తో భ‌రోసా: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా సారంగాపూర్, మండ‌లం సెప్టెంబ‌ర్ 2: ద‌శాబ్ధాలుగా నివాసం ఉంటున్న గూడులేని నిరుపేద‌ల‌కు జీవో నంబ‌ర్. 58 & 59 ప్ర‌కారం క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చేసి వారి జీవితాల్లో సీయం కేసీఆర్ వెలుగునింపార‌ని అట‌వీ, పర్యావ‌ర‌ణ‌, న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు వాటిని క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తున్నట్లు చెప్పారు. సారంగాపూర్ మండ‌లం ప‌రిధిలో జీవో నంబ‌రు 58 క్రింద ద‌ర‌ఖాస్తు చేసుకున్న అర్హులైన ల‌బ్ధిదారుల‌కు యాజ‌మ‌న్య హ‌క్కులు క‌ల్పిస్తూ ప‌ట్టాల‌ను అంద‌జేశారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.పేద‌.మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు నివ‌సిస్తున్న స్థ‌లాల‌కు కూడా యాజ‌మాన్య హ‌క్కు లేక ఇబ్బందులు ప‌డుతున్న వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం గొప్ప అవ‌కాశం క‌ల్పించంద‌న్నారు. ప్రభుత్వ స్థలాలలో నివాసముంటున్న నిరుపేదలకు క్రమబద్ధీకరణ పత్రాలను అందించడంతో యాజమాన్య హక్కును పొందినట్లు అయిందని వెల్ల‌డించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న అర్హులైన వారందరికీ పట్టాలు అంద‌జేస్తామ‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking