జ్వరంతో తీవ్ర అస్వస్థకు గురై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన 26 మంది విద్యార్థినిలు.
రంగసాయిపేట టిఎస్ఆర్డిఎస్ హాస్టల్ స్వయంగా తనిఖీలు.
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్2:
జిల్లాలోని రంగసాయిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన సాంఘిక సంక్షేమ మహిళ హాస్టల్ విద్యార్థినిలు సీజనల్ వ్యాదుల కారణంగా ఒకేసారి 26 మంది తీవ్ర జ్వరంతో అస్వస్థకు గురై ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య శనివారం వరంగల్ ఎంజీఎం నీ సందర్శించి విద్యార్థినిలు చికిత్స పొందే వార్డులోకి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థినులతో మాట్లాడి పరామర్శించారు. విద్యార్థినీలు కోలుకునే వరకు మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చూడాలని అక్కడే ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ , వరంగల్ ఎంజీఎం సూపర్డెంట్ చంద్రశేఖర్ లను ఆదేశించారు. ఈ సందర్బంగా విద్యార్థినులకు అందిస్తున్న చికిత్స గురించి సూపరిండెంట్ కలెక్టర్ కు వివరించారు. అనంతరం ఆమె జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో కలిసి నేరుగా కిల వరంగల్ మండలం రంగసాయిపేట లోని టి ఎస్ ఆర్ డి ఎస్ సాంఘిక సంక్షేమ మహిళ కళాశాలకు బయలుదేరి వెళ్లారు. ఆర్డిఓ, ప్రిన్సిపాల్ సిబ్బంది తో కలిసి ఆమె స్వయంగా హాస్టల్ లోని వంటగదిని, నిల్వ ఉన్న ఆహార ధాన్యాలను, భోజనశాలను, నీటి సరఫరా చేసే బావిని వాటర్ ప్లాంట్లను స్వయంగా తిరిగి పరిశీలించరూ. పరిసరాల అపరిశుభ్రత, డ్రైనేజీలలో మురుగునీరు నిల్వ ఉండడంపై ప్రిన్సిపల్ ను గట్టిగా నిలదీశారు. అనంతరం ప్రిన్సిపాల్ సిబ్బందినీ ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, కొన్ని సూచనలు చేసారు. పేద విద్యార్థినిలు విద్యను అభ్యసిస్తున్న గురుకుల అవరణ ను శుభ్రంగా ఉంచుకోవాలని, తరగతి గదిలో విద్యార్థుల సామాన్లను పెట్టకుండా చూడాలని, హాస్టల్ గదిలో మంచాలను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయాలని, పౌష్టిక ఆహారం తో నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించరూ. జిల్లా విద్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించిన వైద్య శిబిరం లో 26 మంది విద్యార్థులు తీవ్ర జ్వరం తో బదపడుతున్నట్లు గుర్తించే వరకు తెలియకపోవడం ఎంట్టని సిబ్బంది నీ నిలదీశారు.ఎవరైనా అనారోగ్య లక్షణాల తో బదపడినట్లు గుర్తిస్తే 108 ద్వారా ఎంజీఎం కి తరలించాలని అన్నారు. వంటకు వాడే పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, వంటలు వండేందుకు శుభ్రమైన నీరు వాడాలని, ఆకుకూరలను, కూరగాయలను పూర్తిగా కడిగిన తర్వాతనే వాడాలని, ఆహారం నిల్వ ఉన్న గదిలోకి, ఎలుకలు, క్రిమి కీటకాలు, రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నిలువ ఉన్న ఆహార పదార్థాలకు నీరు తగలకుండా చూసుకోవాలనీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలకు తేమ తగలకుండా చూసుకోవాలని, వండిన ఆహార పదార్థాల పైన మూతలు ఉంచుకోవాలని, , ఆహారం తినే ముందు మలవిసర్జన తర్వాత కాళ్లు చేతులు సబ్బుతో కడుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు తినకూడదని, వేడివేడి పదార్థాలు తినాలని విద్యార్థులకు దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారి వెంకటరమణ హాస్టల్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గురుకులం సిబ్బంది ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.