ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా ఆగష్టు 05 :
సోమవారం ఏటూరు నాగారం మండల కేంద్రము లోని హెచ్ ఎన్ టి సి ఐటి డి ఏ ఉద్యానవన నర్సరీలో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటి డి ఎ పి చిత్రా మిశ్రా, ఏ ఎస్ పి ఏటూరు నాగారం శివం ఉపాద్యాయ, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ లతొ కలసి స్వచ్చ దనం పచ్చదనం కార్యక్రమం లో భాగంగా మొక్కలను నాటి పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.
అనంతరం ఏటూరు నాగారం, కన్నాయి గూడెం మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన బ్లాక్ ఫారెస్ట్‌లో తునికి ఆకు సేకరణ లబ్ధిదారులకు బోనస్ 90 లక్షల 25 వేల విలువ గల చెక్కును,ఏటూరు నాగారం మండలంలోని 15 మంది లబ్ధిదారులకు 15 లక్షల 1 వెయ్యి 740 విలవ గల కల్యాణలక్ష్మి , షాది ముభారక్ చెక్కులను అందచేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యెక అధికారి సి ఎస్ ఓ రాం పతి, తహసిల్దార్, ఎం పి డి ఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.