ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూలై 01 :
తారు రోడ్డు మరియు బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క గారు
ఈ రోజు ఉట్నూర్ మండలం లోని రామలింగపేట నుండి శ్యామ్ నాయక్ తండా వరకు 375 లక్షల నిర్మిస్తున్న తారు రోడ్డు మరియు బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించిన అదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క గారు గత పాలకుల నిర్లక్ష్యం మూలాన వెనుకకు నెట్టబడిన గ్రామాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రజలకు రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం కృషి చేస్తుంది అని మేము పాలకులం కాదు సేవకులం అని మంత్రి సీతక్క గారు అన్నారు.
ప్రజలకు మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే విధంగా ప్రజా పాలన ఉంటుంది అని వెనుకబాటుకు గురైన ఈ ఆదిలాబాద్ జిల్లా ను అభివృద్ధి పధం లో తీసుకురావడం కోసం నా శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ వేడ్మ బొజ్జు,జిల్లా కలెక్టర్ గారితో పాటు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు