వికలాంగులకు సహాయ ఉప కారణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూలై 01 :ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రములో మహిళా,శిశు మరియు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికలాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారికి మోటార్ బైక్ లు ట్రై సైకిళ్ళు అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు, ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ వేడ్మ బొజ్జు తో పాటు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో పాటు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.