మైనారిటీ కార్పొరేషన్ లోన్ కి లబ్ధిదారుల ఎంపిక

 

మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 04 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మైనారిటీ కార్పొరేషన్ లోన్ లకు సంబందించిన లబ్ధిదారుల ఎంపిక ఈనెల 6వ తేదీన నిర్వహించబడునని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ…పురపాలక సంఘ కార్యాలయం లక్షెట్టిపేట నందు 2022-23 సంవత్సరం కు సంబంధించి బ్యాంకర్స్ ద్వారా మైనారిటీ కార్పొరేషన్ లోన్ లకు సంబందించిన లబ్ధిదారుల ఎంపిక నిర్వహించబడునని అన్నారు.ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ లతో మున్సిపల్ కార్యాలయం నందు హాజరు కావాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking