ఘనంగా లక్ష్మీనరసింహుని కళ్యాణం

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 04 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ లక్ష్మీ ప్రసన్ననరసింహ ఆలయం లో గురువారం ఘనంగా నిర్వహించారు.లక్ష్మి నరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేకం అనంతరం సుదర్శన నరసింహ యజ్ఞం అభిజిత్ లగ్న ముహూర్తాన స్వామి వారికి కళ్యాణం 11 గంటలకు అనంతరం మహా నివేదన స్వామివారి తీర్థ ప్రసాదన్న వితరణ చేశారు.శుభకృత్ నామ సంవత్సరంలో లక్ష్మీ నరసింహ కళ్యాణం తిలకించడానికి మండలం ఉండే గాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు.ఈ ఆలయ వేదండితులు గొల్లపల్లి శ్రీధరాచార్యులు ఆధ్వర్యంలో రామానంద్ చార్య స్వామీజీ, రుత్వికులు కట్ట అశోక్ చారి,కట్ట నరసింహ చారి, గొల్లపల్లి నరసింహ చారి, విజయ్,సింహాచారి, రాజేష్ చారి,నూతి వెంకటా చారి,వేద మంత్రాల మధ్య కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.వచ్చిన భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించి తీర్థ ప్రసాదాలతో పాటు అన్న వితరణ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking