ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఎదురుగా 8 కోట్ల నిధులతో కలెక్టర్,లోకల్ బాడీస్,రెవెన్యూ తదితర శాఖల రెసిడెన్స్ భవన సముదాయాల నిర్మాణాలకు గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జడ్పి ఛైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్,జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి
SP ప్రవీణ్ కుమార్ లతో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ సమీపంలో ఈ భవనాలను నిర్మించడం వల్ల అధికారులకు పాలన పరంగా సౌకర్య వంతగా ఉంటుందని అన్నారు.
రెండు కోట్ల వ్యయంతో పోలీసు రెసిడెన్సి లను కూడా నిర్మిస్తున్నట్లు మొత్తం 10 కోట్ల తో ఈ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత 10 కోట్ల వ్యయంతో కూడిన ఆ భవన సముదాయాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని ఆరు, ఏడు నెలల్లో భవనాలు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి ఆదేశించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు,లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, తదితరులు ఉన్నారు.