జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 22:
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే రైతు భరోసా, ఇందరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అయిన సంక్షేమ పథకాల అమలు ప్రక్రియలో భాగంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మండలంలో కోల్తూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభలో మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు కంగారు పడవద్దని, ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అంతే కాకుండా గ్రామ, వార్డు సభలలో నోటీసు బోర్డులలో ఉంచిన జాబితాలను ఒకసారి చూసుకొని ఏవైన అభ్యంతరాలు ఉంటే గ్రామస్తులు, గ్రామ పెద్దలు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మూడుచింతలపల్లి తహాసీల్దార్ నర్సింహారెడ్డి, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.