జిల్లా పోలీస్ అధికారుల సంఘం వార్షిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

 

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి జనవరి 22 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2025 సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారులు మరియు సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు.వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యానారాయణ, కార్యాలయ ఏవో మంజ్య నాయక్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, హోమ్గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఉపధ్యాక్షుడు ఏశోబు,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.వెంకటేశ్వర్లు, జానీమియా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking